కరోనాతో రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ కావడంతో.స్వయంగా అక్కడికి వెళ్లి తినే పరిస్థితి అప్పట్లో లేకుండా పోయింది.
దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది.అనేక్ యాప్‌లు కొత్తగా పుట్టుకొచ్చాయి.
కరోనాకు ముందు స్విగ్గీ, జొమాటో( Swiggy, Zomato ) లాంటి కొన్ని యాప్ లు మాత్రమే ఉండేవి.కానీ ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ డెలివరీ యాప్ లు పుట్టుకొచ్చాయి.
ఈ యాప్ లలో ఏ రెస్టారెంట్ నుంచైనా ఆర్డర్ పెట్టుుకుంటే అరగంట లేదా గంటలో మీ డోర్ ముందుకు వచ్చేస్తుంది.దీంతో బిజీ లైఫ్‌లో రెస్టారెంట్‌కి వెళ్లి పుడ్ తినలేనివాళ్లు.
ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు.
అయితే డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ( Delivery boy ) ఇవ్వడానికి వచ్చినప్పుడు మనమే స్వయంగా వెళ్లి తీసుకుంటాం.ఆ సమయానికి ఇంట్లో అందుబాటులో లేకపోపోతే వేరేవారిని తీసుకోమని చెబుతాం.కానీ ఒక చింపాంజీ ఫుడ్ డెలివరీని రిసీవ్ చేసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి పిజ్జా ఆర్డర్ పెట్టాడు.దీంతో డెలివరీ గర్ల్( Delivery girl ) ఇంటికి ఇవ్వడానికి రాగా.
చింపాంజీని చూసి భయపడిపోయింది.అమ్మాయి పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది.
డోర్ ఓపెన్ అవ్వగా.ఒక చింపాంజీ వచ్చి ఎదురుగా ఉంది.
దీంతో అమ్మాయి భయంతో పరుగులు పెట్టింది.
ఆ చింపాంజీ ప్యాంట్, షర్ట్ వేసుకుని ఉంది.దీంతో దానిని పెంచుకున్నట్లు డెలివరీ చేయడానికి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంది.చింపాంజీ డబ్బులు ఇవ్వగా వాటినితీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయింది.
పిజ్జాను చింపాంజీకి ఇచ్చి వెళ్లిపోయింది.దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
దీంతో ఇంట్లో చింపాంజీలు పెంచుకోవడం వినూత్నంగా ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.