గూఢచర్యంపై అమెరికా, చైనా దేశాలు మధ్య గొడవ.. ఏం జరుగుతోందంటే..

చైనా అనేక సంవత్సరాలుగా క్యూబాలో ( Cuba )గూఢచార విభాగాన్ని నడుపుతున్నట్లు తాజాగా ఇంటర్నేషనల్ సంస్థలు కనుగొన్నాయి.దాని గూఢచార సేకరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ విభాగాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్ కూడా చేసిందట.

 The Fight Between America And China Over Intelligence Unit What Is Happening..-TeluguStop.com

యూఎస్ వైట్ హౌస్( White House ) సీనియర్ అధికారి ప్రకారం, క్యూబాలోని గూఢచార యూనిట్ అనేది చైనా తన గూఢచార కార్యకలాపాలను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఒకటి.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ లేటెస్ట్ రిపోర్ట్ ( The Wall Street Journal )ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ఈ ద్వీపంలో నిఘా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి క్యూబాతో చైనా రహస్య ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా క్యూబాకు చైనా ఆర్థిక సాయం చేస్తుందని నివేదిక సూచించింది.

అయితే, ఈ నివేదికపై అమెరికా, క్యూబా ప్రభుత్వాలు రెండు సందేహాలు వ్యక్తం చేశాయి.

వైట్ హౌస్ అధికారి, అనామకంగా మాట్లాడుతూ, ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్న వివరాలతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు.అయితే ఆయన నివేదిక ఎలా తప్పు అనే దానిపై స్పష్టతను కూడా అందించలేదు.2019లో క్యూబాలో చైనా తన గూఢచార సేకరణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేసిందని ఆ అధికారి ధృవీకరించారు, ఇది ఇప్పటికే ఇంటెలిజెన్స్ సర్కిల్‌లలో తెలుసు.వాషింగ్టన్, DC లోని చైనా రాయబార కార్యాలయం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనను ప్రస్తావించింది.ఆ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో US పుకార్లు, అపవాదులను వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.

ఈ ఆరోపణలను క్యూబా ప్రభుత్వం కూడా విమర్శించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube