2023లో టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. గూగుల్ బార్డ్ ఇంటరెస్టింగ్ లిస్ట్‌ విడుదల!

సాధారణంగా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు టాప్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్‌ను దాదాపు ప్రతి ఒక్కరూ చెక్ చేస్తారు.అయితే ఇంతకుముందు వరకు టెక్ వెబ్‌సైట్స్‌ను ప్రజలు ఫాలో అయ్యేవారు.

 These Are The Top Smartphones In 2023 Google Bard Interesting List Released , Sm-TeluguStop.com

కానీ ఇప్పుడు ఏఐ చాట్‌బాట్స్‌( AI chatbots ) అందుబాటులోకి రావడంతో వాటినే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏవో లిఫ్ట్ చేయాలని అడుగుతున్నారు.కాగా తాజాగా 2023లో టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఏవో చెప్పాలని గూగుల్ ఒక నెటిజన్ అడిగారు.

దానికి గూగుల్ బార్డ్ అదిరిపోయే లిస్ట్ తయారుచేసింది.ఆ లిస్టులో నెంబర్ వన్ శామ్‌సంగ్ నిలవడం ఆసక్తికరంగా మారింది.

1.శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా:

Telugu Oneplus, Phone, Samsunggalaxy, Top-Latest News - Telugu

– గూగుల్ బర్డ్‌ పేర్కొన్న నెంబర్ వన్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా( Samsung Galaxy S23 Ultra ).ఇది అధిక రిజల్యూషన్‌తో కూడిన పెద్ద 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది.

– ఫోన్‌లో 200MP ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

– ముందు 12MP కెమెరా ఇచ్చారు.ఇది శక్తివంతమైన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

2.యాపిల్ ఐఫోన్ 14 ప్రో:

Telugu Oneplus, Phone, Samsunggalaxy, Top-Latest News - Telugu

– ఇక సెకండ్ టాప్ స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 14 ప్రోని గూగుల్ బర్డ్ లిస్ట్‌ చేసింది.ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.

– ఇది 48MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

3.గూగుల్ పిక్సెల్ 7 ప్రో:

Telugu Oneplus, Phone, Samsunggalaxy, Top-Latest News - Telugu

– ఇది ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది.12GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంది.

– డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది.క్వాడ్ HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది.

– ఫోన్ 50MP + 48MP + 12MP రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.అలానే 10.8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

– ఇది గూగుల్ Tensor G2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.4926mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది.

4.వన్‌ప్లస్ 11:

Telugu Oneplus, Phone, Samsunggalaxy, Top-Latest News - Telugu

– ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది.

– ఇది సరికొత్త క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది.

– రియర్ కెమెరా సెటప్‌లో 50MP + 48MP + 32MP కెమెరా ఉంటుంది.ముందు 16MP కెమెరా ఉంటుంది.

5.శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4:

Telugu Oneplus, Phone, Samsunggalaxy, Top-Latest News - Telugu

– ఇది 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.2-అంగుళాల సెకండరీ డిస్‌ప్లేతో వచ్చే ఒక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.

– రియర్ కెమెరా సెటప్‌లో 50MP + 12MP + 10MP కెమెరాలు ఉన్నాయి.

– ఇది వన్ UI 4.1తో ఆండ్రాయిడ్ 12Lలో రన్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube