తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ( Telangana formation day )స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రన్ ఘనంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్( VP Gautam ) అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ 2k రన్” కార్యక్రమం నగరంలోని సర్దార్ వల్లభాయి పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది.
ముందుగా ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్,పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్, ( Vishnu s warrier )నగర మేయర్ నీరజ జెండా ఊపి తెలంగాణ 2కే రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిని చాటుతూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన తెలంగాణ 2k రన్ విజయవంతం చేశామని అన్నారు.సుపరిపాలన దినోత్సవాల పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజక వర్గాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన, క్రీడల శాఖ భాగస్వామ్యంతో వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, యువత,స్వచ్ఛంద సంస్థలు,విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొని స్పూర్తిని చాటుకున్నారని అన్నారు.
పోటి పరుగు కాకుండా ఐక్యతను చాటుతూ యువత తెలంగాణ 2k రన్ పూర్తి చేసి విజయవంతం చేశారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు.ఈ సందర్భంగా చివరి పాయింట్ కు ముందుగా చేరుకున్న 25 మందికి జిల్లా కలెక్టర్, నగర మేయర్ చేతుల మీదుగా పతాకాలు అందజేశారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ట్రైనీ ఏఎస్పీ అవినాశ్ కుమార్, ఏసీపీలు రామోజీ రమేష్ ,గణేష్ , ప్రసన్న కుమార్, DYSO పరందమరెడ్డి, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజా,రపర్తి శరత్, కార్నటి కృష్ణ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.