ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

హెయిర్ ఫాల్( Hair fall ) సమస్య తీవ్రంగా వేధిస్తోందా.? దీని కారణంగా మీ జుట్టు రోజు రోజుకు పల్చగా మారుతుందా.? ఎంతో ప్రయత్నించిన జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ఖ‌చ్చితంగా ట్రై చేయాల్సిందే.ఈ రెమెడీ జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

 Best Home Remedy For Controlling Hair Fall! Home Remedy, Hair Fall, Hair, Hair C-TeluguStop.com

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green tea leaves ) వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత గ్రీన్ టీ ని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Remedy, Long, Thick-Telugu Health

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజల పొడిని వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ తో పాటు మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( CURD ) వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( coconut oil ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Remedy, Long, Thick-Telugu Health

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు సిల్కీగా, షైనీ గా మెరుస్తుంది.

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.అలాగే జుట్టు చిట్లి పోవడం విరగడం వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube