ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
TeluguStop.com
హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్య తీవ్రంగా వేధిస్తోందా.? దీని కారణంగా మీ జుట్టు రోజు రోజుకు పల్చగా మారుతుందా.
? ఎంతో ప్రయత్నించిన జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.
ఈ రెమెడీ జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత గ్రీన్ టీ ని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. """/" /
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజల పొడిని వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ తో పాటు మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( CURD ) వేసుకోవాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.
హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు.
పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు సిల్కీగా, షైనీ గా మెరుస్తుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.
అలాగే జుట్టు చిట్లి పోవడం విరగడం వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.
ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మారతారు!