ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు రానున్నారు.ఈ క్రమంలో ఆయన పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.
ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మోదీ పర్యటనను బహిస్కరిస్తున్నట్లు తెలిపారున.తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన మోదీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు.
ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే తెలంగాణపై ప్రేమ పెరిగిందన్నారు.గుజరాత్ లోని కోచ్ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు మంజూరు చేసిన మోదీ తెలంగాణలో ఫ్యాక్టరీకి కేవలం రూ.521 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే రేపటి ప్రధాని పర్యటనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.







