సత్తెనపల్లిలో బొటాపటి( Botapati in Sattenapalli ) మెజారిటీతో నెగ్గిన అంబటి రాంబాబు( Ambati rambabu ) కి జగన్ ప్రభుత్వం బాగానే ప్రయారిటీ ఇచ్చింది.జగన్కు అనుకూలంగా అనేక మీడియా సమావేశాలను నిర్వహించే అంబటి జగన్ వ్యతిరేకులపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.
జగన్ ( Jagan ) పై చీమ కూడా చూసుకుని నేతల్లో ఈయన ఒకరు దానికి ప్రతిఫలంగా ఆయనకు బారీ పారుదల శాఖ మంత్రిగా( Irrigation Minister ) కూడా అవకాశం వచ్చింది.అయితే ఇదే సమయంలో ఆయన అనేక విమర్శలను కూడా మూటగట్టుకున్నారు ఆయన అవినీతిపై రకరకాల వార్తలు కూడా వచ్చాయి.
ఇక నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన గ్రాఫ్ ను బాగా తగ్గించాయని చెప్తున్నారు.తన శాఖ పై కనీస అవగాహన లేనట్లుగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ ను బాగా డామేజ్ చేశాయన్న భావన పార్టీ అధిష్టానం లో ఉందని చెప్తారు.
అయితే వచ్చే ఎన్నికలలో టికెట్టుపై ఆయనకింకా గ్యారెంటీ లేదని పూర్తిస్థాయి సర్వే రిపోర్ట్ లు వచ్చిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయింపు చేసే ఉద్దేశంలో జగన్ ఉన్నారని అంటున్నారు అయితే కన్నా లక్ష్మీనారాయణ ను ఓడించే సత్తా తనకు మాత్రమే ఉందని తనపై ఎంతమంది వస్తాదులను పంపించినా కూడా తాను ఎదురుకోగలను అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో తాను టికెట్ల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల ద్వారా రెండు విషయాలను కన్ఫామ్ చేశారని తెలుస్తుంది పార్టీలు మారుతున్న కన్నా లక్ష్మీనారాయణను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని చెప్పడంఒకటి అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా తాను పార్టీ మారలేదని పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నానన్న వ్యాఖ్యలు చేయటం ఆయన ఉద్దేశం గా తెలుస్తుంది ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డికి కూడా టికెట్ వస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పార్టీకి విశ్వాస పాత్రుడు లా ఉన్నానని తనకు మాత్రమే టికెట్ ఇవ్వాలనే క్లారిటీ పార్టీకి ఇచ్చేలా ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.అయితే కన్నా లక్ష్మీనారాయణ పై అంబటి గెలవగలరు అన్న బరోసా వైసీపీ అధిష్టానానికి ఉందో లేదో మరికొన్ని రోజులలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
.