ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన జయంత్ సి పరాన్జీ ( Jayanth C.Paranjee ) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రమణ గోగులకు బీజీఎం గురించి ఎక్కువగా అవగాహన లేదని అయితే ఆయన మంచి ట్యూన్స్ ఇవ్వడంతో మరొకరికి బీజీఎం విషయంలో ఛాన్స్ ఇచ్చానని ఆయన తెలిపారు.కథ సిద్ధమైన తర్వాతే ఈశ్వర్ లో ప్రభాస్ ను హీరోగా ఫిక్స్ చేశామని జయంత్ సి పరాన్జీ అన్నారు.
కొత్త హీరో కోసం ఈశ్వర్ కథ సిద్ధమైందని ఆయన తెలిపారు.నేను తక్కువగానే రీమేక్ సినిమాలు చేశానని జయంత్ సి పరాన్జీ అన్నారు.
మొహమాటానికి, ఆబ్లిగేషన్ కు యస్ అని చెప్పకూడదని ఆయన తెలిపారు.అయితే అల్లరి పిడుగు సినిమా తర్వాత నేను మారలేదని జయంత్ అన్నారు.
ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకోలేదని ఆయన తెలిపారు.గడిచిన 16 ఏళ్లలో 3 సినిమాలు మాత్రమే చేశానని జయంత్ కామెంట్లు చేశారు.
దేనిని నమ్మితే దానిపై స్ట్రాంగ్ గా ఉండాలని జయంత్ చెప్పుకొచ్చారు. నా ఫస్ట్ సినిమా ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు.సినిమా హిట్టైతే నేనే కారణమని చాలామంది చెబుతారని సినిమా ఫ్లాపైతే నా మాట వినలేదని అంటారని జయంత్ అన్నారు.తరుణ్ సినిమా( Tarun ) విషయంలో నాదే తప్పు అని ఆయన కామెంట్లు చేశారు.
ఒకవైపు తరుణ్ సినిమా, మరోవైపు చిరంజీవి సినిమా చేయడంతో చిరంజీవి ( Chiranjeevi )మూవీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని ఆయన తెలిపారు.
చిరంజీవి సినిమాపై దృష్టి పెట్టిన స్థాయిలో తరుణ్ సఖియా నాతోరా( Sakhiya ) మూవీపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని జయంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాత మరో సినిమా చేసి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.జయంత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.