ఇటీవలే జరుగుతున్న దొంగతనాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.కేవలం డబ్బులు ఉన్నాయి అనే సమాచారం ఉంటే ఎన్నో సరికొత్త ప్లాన్లు రచించి చాలా సులభంగా డబ్బులు కాజేసే దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు.
కొందరు దొంగలకు దొంగతనం అంటే వెన్నతో పెట్టిన విద్య.ఇలాంటి కోవకు చెందిన ఓ దొంగ ఏకంగా పెళ్లి మండపంలో దర్జాగా దొంగతనం చేసేశాడు.
ఈ దొంగతనం అనంతపురం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో చోటుచేసుకుంది.అసలు దొంగతనం ఎలా జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.రాప్తాడు( raptadu ) కు చెందిన బిల్లే నారాయణస్వామి( Bille Narayanaswamy ) కుమార్తెకు, వేపకుంటకు చెందిన సోమన్న కుమారుడికి వివాహం చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.అనంతపురం నగర శివారులో ఉండే నీలం రాజశేఖర్ రెడ్డి కళ్యాణ మండపంలో మే 31వ తేదీన ముహూర్తం, జూన్ 1న తలంబ్రాలు జరిగాయి. అయితే గురువారం పెళ్లికూతురు తల్లిదండ్రులు వచ్చిన బహుమతులను ఒక గదిలో సర్దుతూ, తమ వద్ద ఉండే 7.50 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఉన్న బ్యాగును వారికి ఇచ్చిన సేఫ్టీ గదిలో ఉంచారు.తర్వాత వెళ్లి చూస్తే బ్యాగ్ కనిపించలేదు.
దీంతో ముందుగా ఎవరికీ చెప్పకుండా కళ్యాణ మండపం అంతా వెతికారు.తర్వాత బంధువులకు విషయం చెప్పగా గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆ గదిలోంచి బయటకు వెళ్లాడని చెప్పారు.
దీంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కళ్యాణ మండపం( Kalyana Mandapam ) చేరుకుని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.తర్వాత కళ్యాణ మంటపం ఉండే ఏరియాలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.అందులో ఓ అపరిచిత వ్యక్తి బయటికి వెళ్లడం కనిపించింది కానీ అతను దొంగతనం చేశాడా.లేదా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం పోలీసులు దొంగను పట్టుకునేందుకు ఇలాంటి నేరాలతో సంబంధం ఉన్న వారిని విచారించే పనిలో పడ్డారు.