సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి గుంటూరు కాలం అంటూ టైటిల్ ను కన్ఫర్మ్ చేయడం జరిగింది.ఇటీవల విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అంతే కాకుండా ఈ సినిమా లో మహేష్ బాబు లుక్ అదిరింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా యొక్క చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ కొందరు గుంటూరు టాకీస్ అంటూ ఈ సినిమా కు వ్యతిరేకంగా చర్చ ప్రారంభించారు.సిద్దు జొన్నలగడ్డ మరియు రష్మీ గౌతమ్ జంటగా నటించిన గుంటూరు టాకీస్ సినిమా( Guntur Talkies movie ) అప్పట్లో బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకుంది.
ఇప్పుడు గుంటూరు కారం సినిమాను ఎలా చూపించబోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.యాంటీ ఫ్యాన్స్ యొక్క కామెంట్స్ ను మహేష్ బాబు అభిమానులు బలంగానే తిప్పి కొడుతున్నారు.
గుంటూరు కారం యొక్క టీజర్ విడుదల అయిన తర్వాత సామాన్యుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.ఒకరు ఇద్దరు ఈ సినిమా గురించి తప్పుగా ప్రచారం చేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదని.తప్పుడు కథనాలతో వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముందు ముందు మహేష్ బాబు యొక్క అభిమానులు మాత్రమే కాకుండా యాంటీ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం సినిమాను నచ్చి.మెచ్చి చూసేందుకు క్యూ లైన్ లో నిలబడటం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా లో మహేష్ కి జోడీగా ముద్దుగుమ్మలు పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే.