సోషల్ మీడియా( Social media )లో ఎన్ని వీడియోలు వైరల్ అయినా ఫుడ్ కి సంబందించిన వీడియోలకు ఎప్పుడూ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.నిత్యం ఇక్కడ చిత్ర విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్‌తో కూడిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని రెసిపీ వీడియోలు నెటిజన్లకు నోటిలో నీరు తెప్పిస్తూ ఉంటాయి.మరికొన్ని ఫుడ్ కాంబినేషన్ వీడియోలు మాత్రం నెటిజన్లకు వాంతులు తెప్పిస్తూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఓ రకానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
కావాలంటే ఇక్కడ వున్న వీడియో క్లిప్ చూడండి.మీకే అర్ధం అవుతుంది.ఇక ఈ క్లిప్స్ చూసిన నెటిజన్లు బాబోయ్ ఇదేం కాంబినేషన్ అంటూ పెదవి విరుస్తున్నారు.
లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రాంలో కోల్‌కతా( Kolkata ) వైరల్ రసగుల్లా రోల్ ( Rasgulla roll )వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వీధి వ్యాపారి రోల్స్ తయారు చేయడం మనం గమనించవచ్చు.
మొదట పరాటా తయారు చేసిన తర్వాత దానిపై ఉడికించిన కూరగాయలు, సాస్, కొన్ని రసగుల్లాలు పెట్టాడు.ఆ తరువాత దానిపై మయనీస్ జోడించి రోల్ చేస్తాడు.
కాగా ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.అనేకమంది ఈ ఆహారాన్ని వ్యతిరేకించడం ఇక్కడ కామెంట్లలో చూడవచ్చు.కొందరు ‘ఇదేం ఫుడ్ రా బాబోయ్… మా దగ్గర కుక్కలు కూడా తినవు’ అని కామెంట్ చేస్తే, మరికొందరు ‘బాబోయ్ మీ ప్రయోగాలకు ఒక దండం’ అని కామెంట్ చేయడం చూడవచ్చు.ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ ఏకంగా రెండు లక్షల మందికి పైగా చూడడం కొసమెరుపు.మరెందుకాలస్యం… మీరు కూడా ఆ వీడియోని తిలకించి అభిప్రాయాన్ని తెలియజేయండి.