అవును, ఉక్రెయిన్( Ukraine ) వ్యూహాలకి, పుతిన్( Putin ) సరిహద్దులో భద్రత పెంచాల్సి వచ్చింది పాపం.నేటికి యుద్ధం ప్రారంభించి 15 నెలలు పూర్తవుతోంది.
అయినా ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు.కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేయొచ్చనుకున్న రష్యా భంగపడడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇస్తున్న ఝలక్కులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచుకోవలసి వచ్చింది.తాజాగా ఈ విషయమై తన అధికారులను ఆదేశించిన పరిస్థితి.
బోర్డర్ డిఫెన్స్ డే( Border Defense Day ) సెలవుదినం నేపథ్యంలో FSB (రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్)కి చెందిన బోర్డర్ సర్వీస్‌కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా యుద్ధ జరుగుతున్న ప్రదేశంలో చుట్టూ ఉన్న సమీప ప్రాంతాలను దృఢంగా కవర్ చేయాలని అధికారులను ఆదేశించారు.గత కొన్ని వారాలుగా రష్యా లోపల దాడులు పెరుగుతున్న తరుణంలో సరిహద్దుల్లో భద్రతను పెంచాలని పుతిన్ అభిప్రాయపడ్డారు.రష్యా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు కావచ్చు, మాస్కోకు వాయువ్యంగా ఉన్న చమురు పైప్‌లైన్‌పై దాడి కావచ్చు… ఇలా ఉక్రెయిన్ ఊహించనిరీతిలో చేస్తున్న దాడులకు రష్యా ఖంగు తింది.
కాగా శనివారం రష్యాలోని బెల్గోరోడ్‌లో( Belgorod ) ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇది ఉక్రెయిన్ సైన్యం లక్ష్యంగా ఉన్న ప్రాంతం.కుర్స్క్, బెల్గోరోడ్ ప్రాంతం మొదటి నుండి ఉక్రేనియన్ సైన్యానికి లక్ష్యంగా మారింది.ఈ దాడిలో విద్యుత్, రైలు ఇతర సైనిక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి.ఈ 15 నెలల సుదీర్ఘ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రతీకార దాడులను వేగవంతం చేస్తామని ఉక్రెయిన్ శనివారం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం కొసమెరుపు.