దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్ పై విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా మనీశ్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబుతో పాటు అమన్ దీప్ ధల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
అయితే మనీశ్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్ దీప్ ధల్ పై అభియోగాలు మోపుతూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.