సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నా ఈ నిర్మాతలలో బండ్ల గణేష్( Bandla Ganesh ) ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.కమెడియన్ గా, నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకునిగా బండ్ల గణేష్ కు పాపులారిటీ పెరుగుతోంది.
బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్స్ లో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.త్రివిక్రమ్( Trivikram Srinivas ) ను టార్గెట్ చేసిన ట్వీట్ లో గురూజీ తండ్రీ కొడుకులను విడదీసాడని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
అయితే ఆ ట్వీట్ కు అర్థం బాలయ్య ఎన్టీఆర్ లను త్రివిక్రమ్ విడదీశారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వాస్తవానికి అరవింద సమేత వీర రాఘవ తర్వాత బాలయ్య ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఏర్పడింది.
ఈ గ్యాప్ కు కారణం ఏంటనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు.బాలయ్యకు దగ్గర కావడానికి ఎన్టీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు మాత్రం వర్కౌట్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బండ్ల గణేష్ తన ట్వీట్ లో భార్యాభర్తలను త్రివిక్రమ్ విడగొట్టారని చెప్పుకొచ్చారు.పవన్ ను, అతని భార్యను విడగొట్టింది త్రివిక్రమ్ అని సోషల్ మీడియా( Social media ) వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.పవన్ ను తనను విడగొట్టింది కూడా త్రివిక్రమ్ అని బండ్ల గణేష్ ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.
బండ్ల గణేష్ ట్వీట్లు త్రివిక్రమ్ పరువు తీస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏ దర్శకునిపై రాని విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బండ్ల గణేష్ త్రివిక్రమ్ తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది.త్రివిక్రమ్ పై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.