కేసీఆర్ టార్గెట్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణకు కేంద్రం సాయంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

 Criticism Of Union Minister Kishan Reddy As A Target Of Kcr-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారన్నారు.

బీఆర్ఎస్ నేతలకు 111 జీవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయని తెలిపారు.కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరలేదని ఆరోపణలు చేశారు.

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని చెప్పారు.నీతి ఆయోగ్ కంటే కేసీఆర్ కు ముఖ్యమైన పని ఏముందని ప్రశ్నించారు.30 వేల ఎకరాలను అమ్మేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న కిషన్ రెడ్డి 111 జీవో రద్దుతో హైదరాబాద్ కు ముప్పు తప్పదని వెల్లడించారు.అప్పులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube