SSMB28 ‘మాస్ స్ట్రైక్’ అఫిషియల్ అప్డేట్.. సూపర్ స్టార్ ప్రీ లుక్ అదిరిందిగా!

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) జయంతి రోజున అంటే మే 31న సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుండి అప్డేట్ ఉంటుంది అని చెప్పినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.ఈ అప్డేట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది.

 Ssmb28 Movie Mass Feast Update-TeluguStop.com

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.

సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్( Director Trivikram ) దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండే మరో మూడు రోజుల్లో మాసివ్ అప్డేట్ రాబోతుంది.ఈ విషయాన్నీ తాజాగా కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

త్రివిక్రమ్ మహేష్ తో ఈసారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నట్టు ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్ధం అయ్యింది.ఇక తాజాగా మే 31 ట్రీట్ పై మేకర్స్ అప్డేట్ ఇస్తూ ఒక ప్రీ లుక్ కూడా వదిలారు.ఈ పోస్టర్ లో మహేష్ ఊహించని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

చేతిలో బీడీ పట్టుకుని తలకి ఎర్ర తువ్వాలు కట్టుకుని ఉన్న మహేష్ బ్యాక్ లుక్ ను రివీల్ చేస్తూ మాస్ స్ట్రైక్ అంటూ చెప్పడంతో ఈసారి మాస్ సంభవం గ్యారెంటీ అంటూ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

ఇంకా మూడు రోజులు వెయిట్ చేస్తే ఆ మాస్ సంభవం ఎలా ఉంటుందో తెలిసి పోతుంది.చూడాలి త్రివిక్రమ్ మహేష్ ను ఎలా చూపిస్తాడో.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube