బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్ సుధీర్ (Sudheer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుధీర్ బుల్లితెర పైవరుస కార్యక్రమాలు చేస్తూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది.ఈ విధంగా సుదీర్ క్రేజ్ రోజు రోజుకు పెరగడంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం సుధీర్ వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈయన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతున్నారు.ఇలా సుధీర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన తన సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక ఇంస్టాగ్రామ్ (Instagram)లో సుధీర్ కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది.ఈయన ఇంస్టాగ్రామ్ వేదికగా సుమారు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సుధీర్ తను ఇంస్టాగ్రామ్ ద్వారా చాలామందినే ఫాలో అవుతున్నారని భావించారు.కానీ ఈయన కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకే ఒక వ్యక్తిని(One Person) ఫాలో అవుతున్నారు.మరి ఆ వ్యక్తి ఎవరు అంటే రష్మీ(Rashmi) అని చెబితే మనం పప్పులో కాలు వేసినట్టే.
ఈయన ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారు.సుధీర్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి చిరంజీవి గారు అంటే ఎంతో ఇష్టపడేవారు అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో ఎదుగుతూ వస్తున్నారు.
ఇక తాను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని అంటూ సుధీర్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని బయటపెట్టారు.దీంతో తన అభిమాన నటుడు తన ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే ఫాలో అవుతున్నారు.