పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల(Sreeleela) .ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.
ధమాకా(Dhamaka) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ 15(Dhee 15) ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైంది.

ఈ ఛాంపియన్షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే మే 31వ తేదీ ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇందులో భాగంగా శ్రీ లీల అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.అయితే ఈమె పెర్ఫార్మన్స్ అనంతరం యాంకర్ ప్రదీప్ ( Anchor Pradeep) మీరు ఇంత అద్భుతంగా డాన్స్ చేయడం ఎప్పటినుంచి నేర్చుకున్నారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు నడవడం సరిగా రానీ సమయం నుంచే తన తల్లి డాన్స్ క్లాస్ కి పంపించారని శ్రీ లీలా తెలిపారు.ఇలా మూడు సంవత్సరాల వయసులోనే తాను డాన్స్ క్లాస్ కి వెళ్ళాను అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పారు.

ఇదే ప్రశ్న యాంకర్ ప్రదీప్ హైపర్ ఆది(Hyper Aadi) ని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ.అచ్చం శ్రీ లీల చెప్పిన విధంగానే చెబుతూ మూడేళ్లప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పెట్టేవారు.నేర్చుకోరా డ్యాన్స్ డ్యాన్స్ అని.ఒళ్లంతా బొబ్బలు వచ్చేవి.నాన్న ఇంటికి వచ్చిన తర్వాత డాన్స్ చేయడం నావల్ల కాదు స్కూల్ కి వెళ్తాను నాన్న అని చెప్పగా ఆయన ముందు ఒక మందు పెగ్గు వేసి ఊగుతూ ఉంటాడు ఇదే డాన్స్ అని అంటాడు అంటూ శ్రీ లీలను స్పూఫ్ చేస్తూ తనని దారుణంగా అవమానపరిచారు.
అయితే ఈమె సరదాగా తీసుకొని ఆది వ్యాఖ్యలకు నవ్వుతూ ఉండిపోయారు.