ఈ భూమి పై జన్మించిన ప్రతి జీవికి మరణం ( Death ) తప్పదు అని కచ్చితంగా చెప్పవచ్చు.అయితే ఏ మనిషికైనా మృత్యువు సమీపిస్తున్నప్పుడు అతను ఎటువంటి అనుభూతికి గురవుతాడనే దానిపై చాలా రకాల పరిశోధనలు జరిగాయి.
ఇంకా జరుగుతూనే ఉన్నాయి.అయితే ఒక నిపుణుడు దీని పై చాలా వివరాలను వెల్లడించాడు.
లివర్ పూల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు సీమస్ కోయల్ అందించిన సమాచారం ప్రకారం మనిషి మరణించే ప్రక్రియ అతనిలో రెండు వారాల ముందే మొదలవుతుంది.అతని ఆరోగ్యం క్షీణిస్తుంది.
అలాగే నిద్రించడం కూడా ఎంతో ఇబ్బందిగా మారుతుంది.జీవితపు చివరి రోజుల్లో మనిషికి ఔషధాలు తీసుకోవడం లో, భోజనం చేయడంలో ఏదైనా తాగడంలోనూ చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

మరికొందరు పరిశోధనలు మెదడు నుంచి పలు రసాయనాలు కూడా విడుదలవుతాయని చెబుతున్నారు.వాటిలో ఒకటి ఎండోఫ్రిన్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రసాయనం మనిషి భావాలను అమితంగా ప్రభావితం చేస్తుంది.మనిషి తను మరణించే సమయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టమవుతుంది.అయితే ఇప్పటి వరకు అందిన పలు పరిశోధనల వివరాల ప్రకారం మనిషి మృత్యువుకు సమీపిస్తున్న కొద్ది అతని శరీరంలో స్ట్రెస్ కెమికల్( Stress Chemical ) వృద్ధి చెందుతూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ బాధితులకు( Cancer Patients ) మరణ సమయంలో శరీరం వాపుకు గురవుతుంది.ఇంకా చెప్పాలంటే మరణించే సమయంలో మనిషిలో శరీర నొప్పులు తక్కువ కావడం జరుగుతూ ఉంటుంది.ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధకులకు కూడా ఇంత వరకు అంతు చిక్కలేదు.
అయితే ఇది ఎండోఫ్రిన్ కారణంగా జరుగుతుందని కొంత మంది పరిశోధకులు భావిస్తున్నారు.అంతేకాకుండా ప్రతి మనిషి మరణం ఒక్కో విధంగా ఉంటుంది.
ఇటువంటి పరిస్థితులలో మృత్యుకు సంబంధించిన పలు విషయాల్లో పరిశోధకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి.ఈ లక్షణాలన్నీ సాదరణ మరణానికి మాత్రమే వర్తిస్తాయి.







