నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) మే 20వ తేదీ తను 40వ పుట్టినరోజు ( Birthday ) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వేలువెత్తాయి.ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )సైతం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.“హ్యాపీ బర్త్ డే బావ.హాప్ యు హ్యావ్ ఎ బ్లడీ గుడ్ బర్త్ డే” అంటూ ట్వీట్ చేసారు బన్నీ. ఇలా ఎన్టీఆర్ ను బావ అంటూ తనకు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో వీరిద్దరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.గతంలో కూడా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తనకు శుభాకాంక్షలు చెబుతూ బావ అని సంబోధించారు.
బావ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా పార్టీ లేదా పుష్ప అంటూ కామెంట్ చేయడంతో ఈ పోస్టులు అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ ను బావ అని సంబోధిస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ ( Koratal Shiva ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమాకు దేవర ( Devara ) అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.