పెళ్లి మండపం కుటుంబ సభ్యులతో, బంధువులతో కళకళలాడుతోంది.ఒకపక్క భోజనాలు కూడా గుమగుమలాడుతున్నాయి.
పెళ్లి ముహూర్తనికి సమయం అవుతూ ఉండడంతో వధూవరులు పెళ్లి మండపానికి చేరుకున్నారు.ఇక తాళి కట్టడానికి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇంతలో వధూవరులు ఇద్దరు విషం తాగడంతో( Poison ) కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అందరూ కలిసి హుటాహుటిన వధూవరులను ఆసుపత్రికి తరలించే లోపే వరుడు ( Groom ) ప్రాణాలు విడిచాడు.
వధువు( Bride ) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది.అసలు వధూవరులు ఎందుకు విషం తాగారో తెలియక పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు.
వధూవరులు ఇద్దరు విషం తాగడానికి గల కారణాలు ఏమిటంటే.?
వివరాల్లోకెళితే.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన యువతి, యువకుడికి ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు.మంగళవారం పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెళ్లి మండపానికి బంధువులంతా వచ్చేశారు.మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపంలో వధూవరుల మధ్య గొడవ జరిగింది.
దీంతో వరుడు కోపంతో విషం తాగాడు.ఈ విషయం తెలిసి వధువు కూడా విషం తాగేసింది.
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వరుడు మృతి చెందాడు.వధువు కొన ఊపిరితో ఉంది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా అందరిని విచారించారు.అసలు విషయం ఏమిటంటే.వధువు తొందరగా పెళ్లి చేసుకోవాలని వరుడిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.వరుడు మాత్రం పెళ్లికి రెండేళ్ల సమయం కావాలని కోరాడు.
దీంతో వధువు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా మంగళవారం పెళ్లి జరిపించాలని డేట్ ఫిక్స్ చేసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు.పెళ్లి మండపంలో ఇదే విషయంలో మళ్లీ గొడవ జరగడంతో వధూవరులు విషం తాగారని తెలిసి పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యపోయారు.