ఎప్పుడూ అదే లక్ అంటే కుదరదుగా కుమారస్వామి ?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.అదృష్టం అనేది కూడా అంతే.

 Reasons For Kumaraswamy Jds Party Defeat In Karnataka Details, Kumaraswamy, Jds-TeluguStop.com

అప్పుడప్పుడు మాత్రమే అది వరిస్తూ ఉంటుంది.ఎప్పుడూ దాన్నే నమ్ముకుని ఎక్కువ ఊహించుకుంటే భంగపాటు తప్పదనే విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జెడిఎస్ అధినేత కుమారస్వామికి తెలిసి వచ్చింది.

కేవలం అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిన కుమారస్వామి కి( Kumaraswamy ) ఎప్పుడూ 30 నుంచి 40 స్థానాలకు మించి రాకపోయినా, ముఖ్యమంత్రి పదవి( CM Seat ) దక్కుతుండడంతో కుమారస్వామి ఈ ఎన్నికల్లోను అదే ఫార్ములా పనిచేస్తుందని ఆశించారు.

తాను కింగ్ మేకర్ గా మారుతానని, ముఖ్యమంత్రిగా అవకాశం దక్కుతుందని భావించారు.

కానీ కాంగ్రెస్ కు( Congress Party ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాలు దక్కడం, జేడీఎస్ కొన్ని స్థానాలకి పరిమితం కావడంతో కుమారస్వామి ఆశలు ఆవిరి అయ్యాయి.జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి ప్రధాన శత్రువులుగా ఉండడంతో, అదే తమకు కలిసి వస్తుందని, గతంలో మాదిరిగా ఇప్పుడు సీఎం పీఠం దక్కుతుందని కుమారస్వామి అంచనా వేశారు.

Telugu Congress, Dk Siva Kumar, Jds, Karantaka, Kumaraswamy, Modhi, Nithin Gowda

కానీ పాత మైసూర్ ప్రాంతానికి పరిమితమైన కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్ ఈసారి అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.పాత మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఆదిక్యం లో నిలిచింది.ఒక్కలిగా సామాజిక వర్గం కూడా ఈసారి కుమారస్వామి కుటుంబానికి మద్దతు ఇవ్వలేదనే విషయం ఈ ఎన్నికల్లో రుజువైంది.అలాగే ఇదే సామాజిక వర్గం చెందిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ వైపు ఒక్కలిగలు మొగ్గు చూపించడంతో కుమారస్వామి పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి.

చివరకు కుమార్ స్వామి, ఆయన కుమారుడు నితిన్ గౌడ కూడా ఓటమి చెందారు.

Telugu Congress, Dk Siva Kumar, Jds, Karantaka, Kumaraswamy, Modhi, Nithin Gowda

కుటుంబ పార్టీగా జెడిఎస్ కు ముద్ర పడడం వంటివి కూడా ఆ పార్టీ ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపించాయి.కుమారస్వామి జనాల్లో ఎక్కువగా ఉండకపోవడం, పార్ట్ టైం పొలిటిషన్ గా ఆయనకు ముద్ర పడిపోవడం , ఎన్నికల సమయంలోనే జనాల మధ్యకు రావడం ఇవన్నీ జెడిఎస్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.అలాగే స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం, ఇవన్నీ జేడీఎస్ ఓటమి లో భాగస్వామ్యం అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube