సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా సూపర్ సెన్సేషన్ గా మారింది.ఈ సినిమా రిజల్ట్ తో తేజ్ లో మునుపటి జోష్ వచ్చింది.
ఇక ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల ప్లానింగ్ లో ఉన్నాడు సాయి ధరం తేజ్.అందులో ఒకటి సంపత్ నంది డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుండగా.
రెండోది వినాయక్ డైరెక్షన్ లో ఉండబోతుందని తెలుస్తుంది.ఖైదీ నెంబర్ 150, ఇంటిలిజెంట్ సినిమా( Inttelligent )ల తర్వాత వినాయక్( V V Vinayak ) హీరోగా ఒక సినిమా చేశాడు.
అది పక్కన పెట్టి బెల్లంకొండ శ్రీనివాస్ తో చత్రపతి సినిమా హిందీ రీమేక్ చేశాడు.
హిందీలో చత్రపతి రిలీజ్ ప్లానింగ్ లో ఉండగా తెలుగులో మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు వినాయక్.
సాయి ధరం తేజ్ తో ఆల్రెడీ ఇంటిలిజెంట్ సినిమా తీసి ఫ్లాప్ ఇచ్చిన వినాయక్ మరోసారి అతనితో సినిమాకు సిద్ధం అయ్యాడు.ఈ సినిమా కథ క్రైం థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.
సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.సాయి ధరం తేజ్ వినాయక్ ఈసారైనా సూపర్ హిట్ కొడతారేమో చూడాలి.