తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో కోరారు.నాలుగేళ్ల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.010 పద్దు కింద వేతనాలు ఇస్తూ ఈహెచ్ఎస్ కార్డులను అందజేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు.అంతేకాకుండా ఓపీఎస్ వారిని కూడా రెగ్యులర్ చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖలో విన్నవించారు.
తాజా వార్తలు