ఈ వేసవిలో కూల్ కూల్ ఆఫర్లు వినియోగదారులను ఊరిస్తున్నాయి.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్( Amazon, Flipkart ) వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్‌లో ఇప్పటికే సమ్మర సేల్స్ స్టార్ట్ కాగా ప్రముఖ సంస్థలు సమ్మర్‌లో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి.
భారతదేశంలో ఎంఐ ( MI )ఉత్పత్తులకు ఓ ప్రత్యేక స్థానం ఉందని అందరికీ తెలిసిందే.దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ అప్పుడప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త మోడల్స్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు గృహోపకరణాలు వంటివి రిలీజ్ చేస్తుంది.
అదేవిధంగా ప్రతిసారి సరికొత్త ఆఫర్లతో సేల్స్‌ను కూడా నిర్వహిస్తుంది.

ప్రస్తుతం ఎంఐ కంపెనీ ఫ్యాన్ డే సేల్స్‌తో( MI Company Fan Day Sales ) మీ ముందుకు వచ్చింది.అంతే కాకుండా ఎంఐ ప్రొడెక్ట్స్‌పై గతంలో ఎవ్వరూ ఇవ్వనంత డిస్కౌంట్స్‌ను ఈ సేల్లో ప్రకటించడం విశేషం.ఇప్పటికే ప్రారంభమైన ఎంఐ ఫ్యాన్‌డే సేల్ ఈ నెల 10 వరకూ జరగనుండడం విశేషం.ఈ సేల్‌లో రెడ్ మీ ప్యాడ్ రూ.5999కే ఇపుడు సొంతం చేసుకోవచ్చు.మీ వద్ద ఉన్న పాత ఉత్పత్తిని ఎక్స్చేంజ్ చేస్తే రూ.14,999 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉంది.అలాగే బ్యాంక్ డిస్కౌంట్లన్నీ కలుపుకుంటే రెడ్‌ప్యాడ్ రూ.5999కే సొంతం చేసుకోవచ్చు.

అదేవిధంగా ఎంఐ 11ఐ హైపర్ ఫోన్ రూ.22,999కు అందుబాటులో ఉన్నా ఎక్స్చేంజ్ ఆఫర్లు, పేటీఎం క్యాష్ బ్యాక్ అన్నీ వర్తింపజేస్తే ఈ ఫోన్ రూ.11,699కే సొంతం చేసుకోవచ్చు.అలాగే టివి కావాలని అనుకున్నవారు ఎంఐ ఓఎల్ఈడీ విజన్ టీవీ ఈ సేల్‌లో కేవలం రూ.71,999కే అందుబాటులో ఉంది.ఈ టీవీ సాధారణ ధర రూ.99,999గా ఉంది.అయితే కూపన్ కోడ్ ద్వారా రూ.25,000 తగ్గింపు లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లు: 1.క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ప్రొడెక్ట్ కొనుగోలు చేసిన వారికీ రూ.8000 వరకూ తగ్గింపు.2.ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పై రూ.2000 తగ్గింపు.3.హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్స్‌యాక్షన్‌పై రూ.5000 తగ్గింపు.4.పేటీఎం వ్యాలెట్ కొనుగోలుపై రూ.3000 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.