17 ఏళ్లకే చదువు ఆపేసినా 22 ఏళ్లకే మిలియనీర్ అయ్యాడు... ఎలా?

17 ఏళ్లకే అతగాడు చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసాడు.కట్ చేస్తే ఆ కుర్రాడే 22 సంవత్సరాలకే మిలియనీర్ గా( Millionaire ) అవతరించాడు.

 Dropped Out Of School At 17 Became A Millionaire At The Age Of 22 Hayden Bowles-TeluguStop.com

ఏ పనీ చేయకపోయినా జీవితం గడిచిపోయేంతగా డబ్బులు సంపాదించి హాట్ టాపిక్ అయ్యాడు.అతడే 22 సంవత్సరాల వయస్సు గల హేడేన్ బౌల్స్.

( Hayden Bowles ) 17 ఏళ్ల వయసులో చదువు ఆపేసి ఆన్‌లైన్ కోర్సులను అందించే ఈ కామ్ సీజన్ విద్యా సంస్థను ప్రారంభించాడు.రియల్ ఎస్టేట్‌లో( Real Estate ) పెట్టుబడులు పెట్టాడు.

ఇక అక్కడి నుంచి అతనికి ఆదాయం వరదలా రావడం మొదలుపెట్టింది.

ఎవరైనా 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌కి ప్లాన్ చేసుకుంటారు.కానీ అతని వద్ద ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్నా జీవితకాలానికి సరిపడా డబ్బును సంపాదించి తనతోటివారికి రోల్ మోడల్ గా నిలిచాడు.ఈ క్రమంలో హేడేన్ తన విద్యా సంస్థ ఈ కామ్ సీజన్ ద్వారా $4 మిలియన్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా మరో $1.5 మిలియన్లు సంపాదించాడట.వచ్చిన లాభాలను తన పార్టనర్‌తో కలిసి పంచుకోవడం విశేషం.

అతగాడు ఎంతలా సంపాదించాడు అంటే, లంబోర్ఘిని కారు( Lamborghini ) కొనేంత డబ్బు సంపాదించగలిగాడు.అతని సక్సెస్ కి సూత్రాలు ఏంటి అని ఎవరైనా అడిగితే… “ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిని సెట్ చేసుకొని చేసే పని మీద దృష్టి పెట్టి, వచ్చిన దానిని పొదుపు చేయండి.కేవలం సంపాదన మీదనే మీ దృష్టి పెట్టండి” అని హేడేన్ నేటి యువతకి సూచిస్తున్నాడు.ఇంత చిన్న వయసులో అంత పెద్ద టార్గెట్స్ పెట్టుకుని సక్సెస్ ఫుల్‌గా ముందు సాగిపోతున్న హేడెన్ ఇప్పటి యువతకు నిజంగా ఆదర్శం అని చాలామంది నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా చాలా మీటింగ్స్ లో అతగాడి గురించి కధలుకధలుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube