మన చిన్నతనంలో తోబుట్టువులతో కలిసి ఆడిన ఆటలు జీవితాంతం గుర్తుండిపోతాయి.అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు సంతోషంతో నిండిపోతుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మన చిన్ననాటి సంగతులు మనకి ఠక్కున గుర్తుకు రాక తప్పదు.ఇక్కడ వీడియోలో ఓ అక్క, తమ్ముడు చేసిన మ్యాజిక్ ట్రిక్( Magic trick ) చూసి నెటిజనం నవ్వలేక పడిచస్తున్నారు అని చెప్పుకోవచ్చు.
హర్ష మరివాళ షేర్ చేయగా వెలుగు చూసింది.

వైరల్ అవుతున్న వీడియోలో.ఒక చిన్నారి తన సోదరుడి సహాయంతో మ్యాజిక్ ట్రిక్ ట్రై చేసింది.ఈ క్రమంలో ఆ బాలిక( girl ) తన తమ్ముడు మాయమయ్యే ట్రిక్ ట్రై చేసింది.
తమ్ముడి ముందు ఆ చిన్నారి టవల్ ఊపుతుండగా, ఆ కుర్రాడు మోకాళ్లపై పక్కకు వెళ్లిపోయాడు.ఆ బాలిక టవల్ తీసి తన సోదరుడు అదృశ్యమయ్యాడని అనుకొని అందరికీ చెప్పింది.
అయితే అప్పటికీ ఆమె సోదరుడు ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాడు.దీంతో ఆ అమ్మాయి తన సోదరుడి ముడ్డిమీద ఓ తన్ను తన్నింది.కాగా ఈ వీడియోని చూసి నెటిజనం తెగ నవ్వుకుంటున్నారు.

ఈ క్యూట్ వీడియోను ఇప్పటివరకు 71 లక్షల మంది వీక్షించగా 9900 మంది లైక్ చేయడం విశేషం.ఈ వీడియోని చూసిన క్రమంలో ఎంతో మంది తమ చిన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతుండడం ఇక్కడ చూడవచ్చు.ఆ చిన్నారుల అమాయకత్వం చాలా క్యూట్‌గా ఉందని కొంతమంది కామెంట్ చేస్తే, వీడియో చాలా ఫన్నీగా ఉందని, చాలా చాలా ఎంజాయ్ చేశామని కొందరు అంటున్నారు.
ఇప్పటివరకు తాను చూసిన వాటిల్లో ఇదే బెస్ట్ మ్యాజిక్ ట్రిక్ అని మరొకరు కామెంట్ చేశారు.







