మణిపూర్ లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, పౌరులను తరలించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా మణిపూర్ నుంచి విద్యార్థుల తరలింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ క్రమంలో ఏపీ రెండు విమానాలు, తెలంగాణ ఓ విమానాన్ని ఏర్పాటు చేశాయి.మరికాసేపటిలో విద్యార్థులను, కార్మికులను తీసుకుని విమానాలు బయలు దేరనున్నాయి.
ఇంఫాల్ నుంచి నేరుగా ఓ ఫ్లైట్ చేరుకోనుండగా కోల్ కతా మీదుగా మరో విమానం శంషాబాద్ చేరుకోనుంది.







