డబ్బు ఎవరికక్కర్లేదు.అదే తేరగా వస్తుందంటే ఇంకా ఎవరు వదులుకుంటారు.
పది రూపాయల నోటు రోడ్డుపై పడితేనే దాన్ని తీసుకోవడానికి తన్నుకొనే జనం, నోట్ల కట్టలు కట్టలుగా ఫ్రీగా దొరుకుతున్నాయంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి? అవును, బీహార్‌లో( Bihar ) సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.మురికి కాలువలో 10రూపాయలు, 100రూపాయల నోట్ల కట్టలు దొరికుతున్నాయని తెలిసిన స్థానిక జనం ఎగబడ్డారు.
మురికి నీళ్లలోకి దూకి మరీ నోట్ల కట్టలను ఏరుకున్నారు.దుర్గంధం వెదజల్లే డ్రైనీజీలోకి దిగడమే కాకుండా మురికి నీళ్లలో నానిపోయిన 100,10 రూపాయల నోట్ల కట్టలను ఎవరికి దొరికినన్ని వాళ్లు సొంతం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిందిపుడు.

బీహార్, ససారంలోని మొరాబాద్ ( Morabad )కాలువలో కరెన్సీ నోట్ల కట్టలు( Bundles of currency notes ) ఉన్నాయనే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి తండోప తండాలుగా ఎగబడ్డారు.విషయం కడకు పోలీసుల వరకు చేరడంతో అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.స్పాట్‌కి చేరుకున్న పోలీసులు స్థానికుల్ని చెదరగొట్టారు.అప్పటికే కొందరు నోట్ల కట్టలను తీసుకెళ్లడంతో.అవి అసలు నోట్లా లేక ఫేక్ కరెన్సా అనే దిశగా విచారణ సాగిస్తున్నారు.అయితే పోలీసులు మాత్రం అసలు డ్రైనీజీలోకి డబ్బుల కట్టలు ఎలా వచ్చాయి? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

డబ్బంటే ప్రజలకు ఉన్న ఆశ ఎలాంటిదో తెలియజెప్పే ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మొదట ఓ వ్యక్తి గుర్తించగా.నోట్ల కట్టలతో అతగాడు బయటకు రావడం చూసి, స్థానికులు పెద్ద సంఖ్యలో మురికినీటి కాలువలోకి దూకి 10, 100 రూపాయల నోట్ల కట్టలను తీసుకొస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాంతో ఆ విషయం కాస్త సోషల్ మీడియాకి ఎక్కింది.
మురికి కాలువలో బయటపడ్డ నోట్ల కట్టలు అసలైన డబ్బులేనా లేక నకిలీవా అనే సందేహాన్ని పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు.







