నిన్న మొన్నటి వరకు కేసీఆర్( KCR ) మాత్రమే మన అధ్యక్షుడు కేసీఆర్ మాత్రమే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చెప్పుకొచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఇప్పుడు పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న వైనం హాట్ డిబేట్ గా మారింది .భరాసాగా మారిన టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటినుంచి కెసిఆర్ నోటి వెంట తప్ప మరెవరు కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర లేదు.
అయితే ఇప్పుడు వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఇక పార్టీకి అన్ని తానే అన్న సంకేతాలను పార్టీ శ్రేణులుకు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది .కరీంనగర్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ ను ( Gangula Kamalakar ) ప్రకటించడంతో మొదలుపెట్టిన అభ్యర్థుల ప్రకటన
ఆ తర్వాత ని హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి ని , హనుమకొండలో వినయ్ భాస్కర్ ను మళ్లీ కరీంనగర్ సభలో ఎంపీ అభ్యర్థిగా వినోద్ ను, హుస్నాబాదులో రమేష్ ను ఇలా వరుస పెట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ పార్టీలో కొత్త చర్చకు తెర తీశారు .ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుని తమ నియోజకవర్గంలో పర్యటించేలా తద్వారా తమ టికెట్ కన్ఫామ్ చేసుకునే ఆలోచనలు చేసుకుంటున్నాట్లుగా తెలుస్తుంది .

అభ్యర్థుల ప్రకటనే కాక పార్టీ నేతలకు కార్యకర్తలకు వ్యూహ ప్రతి వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడమే కాదు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా బదులు చెప్పడంలో కూడా అన్ని తానే వ్యవహరిస్తున్న విధానం తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ ఏ అని స్పష్టం చేస్తుంది ….గత సంవత్సర కాలంగా అనేక సందర్భాలలో ఎమ్మెల్యేలు తమ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని బహిరంగంగా కూడా ప్రకటించినప్పటికీ ఆయన వాటిని కొట్టి పారేసేవారు

కానీ ఇటీవల ఆయన వ్యవహార శైలి లో వచ్చిన మార్పులను బట్టి చూస్తే కచ్చితం గా బారస ముఖ్య మంత్రి అభ్యర్థి అని స్పష్టం అవుతుంది.కెసిఆర్ జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారని ఇక చినబాబే ఇక తమ లీడర్ అని గులాబీ దళం కూడా మానసికం గా సిద్దం అయిపోయారని వార్తలు వస్తున్నాయి .మరి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూసే సమయం మరింత దూరంలో లేనట్లుగా తెలుస్తుంది.







