కొన్ని సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.సినిమా స్టోరీని బట్టి డైరెక్టర్ ఈ స్టోరీ కి ఎవరైతే బాగుంటారు అని ఆలోచించుకొని ఆ పాత్రకి సెట్ అయే హీరోయిన్ ని తీసుకుంటారు ఒక సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ వేరే సినిమాల్లో కూడా ఉంటారు.
ఎందుకంటే వాళ్లిద్దరి పర్ఫామెన్స్ బాగుండటం జనాల్లో బాగా పేరు సంపాదించు కోవడం వల్ల డైరెక్టర్స్ వల్లనే రిపీట్ చేస్తూ ఉంటారు.ఈ జనరేషన్ లో కొన్ని సినిమాల్లో రిపీట్ అయిన కొంత మంది హీరోయిన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం… ముందుగా సమంత, ప్రణతి( Samantha , Pranathi ) వీళ్లిద్దరూ అత్తారింటికి దారేది( Attarintiki daredhi ) సినిమాలో అక్క చెల్లెలు గా నటించి మెప్పించారు.
అలాగే ఈ సినిమా తర్వాత ప్రణతి చాలా సినిమాల్లో నటించింది.ఇక ఎన్టీయార్ హీరోగా వచ్చిన రభస( Rabhasa ) సినిమాలో కూడా సమంత, ప్రణతి ఇద్దరు కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేశారు ఇక వీళ్ళ కాంబో యాక్టింగ్ కి ఇండస్ట్రీ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక వీళ్లిద్దరి తరవాత సమంత, కాజల్ అగర్వాల్ ( Samantha, Kajal Aggarwal )గురించి చెప్పాలి వీళ్లిద్దరూ బృందావనం( Brundavanam ) అనే సినిమాలో హీరోయిన్స్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది…ఇక దాని తరువాత మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వచ్చిన సినిమా బ్రంహోత్సవం ( Bramhotsavam ) సినిమాలో నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది అయిన కూడా కాజల్ సమంత యాక్టింగ్ లకి మంచి పేరు వచ్చింది…
.