భారతదేశానికి 52 సంవత్సరాల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్( Asian Badminton Championship ) పతకం దక్కింది.అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలలో ఏదో ఒక పతకం సాధిస్తున్న, ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలలో మాత్రం పతకం సాధించడానికి ఏకంగా 52 సంవత్సరాల సమయం పట్టింది.
దుబాయ్ వేదికగా 2023 ఆసియా బ్యాట్మెంటన్ ఛాంపియన్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమిస్ కు భారత నెంబర్ వన్ జోడి సాయి సాత్విక్ – చిరాగ్ షెట్టి( Sai Satvik – Chirag Shetty )ల జోడి ద్వారా కాంస్య పతకం దక్కింది.గత రెండు సంవత్సరాలుగా సాయి సాత్విక్- చిరాగ్ షెట్టి ల జోడి అంతర్జాతీయ బ్యాట్మింటన్ పురుషుల డబుల్స్ లో నిలకడగా రాణిస్తూ ఎంతో అపార అనుభవం ఉన్న ఇండోనేషియా జోడి హెండ్రా – అహ్ సాన్( Jodi Hendra – Ah San ) లను 21-11,21-12 లతో చిత్తు చేశారు.
భారత్ కు ఫైనల్ లో చోటు దక్కాలంటే సెమిస్ పోరులో చైనీస్ తాపీ జోడి అయినా లీ యాంగ్ – వాంగ్ చీ లిన్ తో తడపడాల్సి ఉంది.
తాజాగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ ద్వారా ఐదు దశాబ్దాల అనంతరం భారత్ సెమీ ఫైనల్ కు చేరి పతకం కాయం చేసుకుంది.ఇక మహిళల బ్యాడ్మింటన్ విషయానికి వస్తే.మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 5-21, 9-21 తో అన్ సె యంగ్ ఓడింది.
గత కొంతకాలంగా పీవీ సింధు వైఫల్యాల పరంపరమే కొనసాగిస్తూనే ఉంది.పురుషుల సింగిల్స్ లో కూడా భారత్ కు నిరాశే మిగిలింది.క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో జరిగిన రెండో గేమ్ పూర్తి కాకుండానే భారత ఆటగాడు గాయంతో ఉపసంహరించుకున్నాడు.భారత్ తరపున పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లలో బరిలోకి దిగితే చివరకు.
పురుషుల డబుల్స్ లో మాత్రమే పతకం కాయం అయింది.భారత క్రీడాకారులకు ఒలంపిక్స్ లో పతకం సాధించడం కన్నా, బ్యాట్మెంటన్ టోర్నీలలో పతకం సాధించడం చాలా కష్టంగా మారింది.