కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ రాజకీయ సమీకరణలను బేరీజు వేస్తున్నాయి.
పొత్తుల విషయంలోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ముఖ్యంగా పొత్తుల అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఏ పార్టీతో ఎవరు కలుస్తారు ? పొత్తులో ఉంటే ఏ పార్టీకి నష్టం ? ఏ పార్టీకి లాభం ? ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్( BJP ) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు.
ఎందుకంటే ఈ రెండు పార్టీలకు స్వచ్చందంగానే అధికారం చేపట్టగల సత్తా ఉంది.

దాంతో ఇతర పార్టీలపై ఆధార పడవలసిన అవసరం లేదనే చెప్పాలి.ఇక ఈ రెండు పార్టీల తరువాత బలమైన పార్టీగా ఉన్న జెడిఎస్ పైనే అందరి చూపంతా.ఎందుకంటే ఈ పార్టీతో కలిసేందుకు ఏం ఐ ఏం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బిఆర్‌ఎస్( Brs party ) వంటి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.
దాదాపు 30 నుంచి 40 స్థానాలలో అత్యంత ప్రభావం చూపగలిగే జెడిఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొనుంది అనేది అత్యంత ఆసక్తికరం.కాగా జెడిఎస్ తో పొత్తు ఉంటుందని, ఆ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతామని మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఏంఐఏం పార్టీ.
జెడిఎస్ లోని పలువురు నేతలు కూడా ఏం ఐ ఏం తో పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు.కానీ అధినేతలు వి.హెచ్ దేవగౌడ, H.D కుమారస్వామి( H.D.Kumaraswamy ) వంటి వాళ్ళు పొత్తు విషయంలో మౌనం పాటిస్తూనే వచ్చారు.

ఇక బిఆర్‌ఎస్ తో మొన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన కుమారస్వామి సరిగ్గా ఎన్నికల సమయానికి బిఆర్‌ఎస్ తో అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు.మరోవైపు కాంగ్రెస్ కు బై బై చెప్పి కర్నాటక ఎన్నికల బరిలో దిగుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ ( NCP ) పార్టీ కూడా జెడిఎస్ తో పొత్తు పొట్టుకోవాలని చూస్తోంది.ఇలా అన్నీ పార్టీలు కూడా జెడిఎస్ తో పొత్తు కోసం ఆశగా చూస్తున్న నేపథ్యంలో.ఏ పార్టీ తోను పొత్తు ఉండదని ఎన్నికల్లో జెడిఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి బిగబోతుందని ఆ పార్టీ అధినేతలు స్పష్టం చేశారు.

దీంతో పొత్తుల విషయంలో వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది.అయితే ఒంటరిగా పోటీ చేసేందుకు జెడిఎస్ కాన్ఫిడెన్స్ ఏంటి అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం… ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హంగ్ ఏర్పడే అవకాశాలే కనిపిస్తున్నాయి .ఒకవేళ అదే గనుక జరిగితే జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.అప్పుడు ఏ పార్టీ అయిన అధికారం చేపట్టలంటే జెడిఎస్ మద్దతు చాలా కీలకం.
అందువల్ల ప్రస్తుతం ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగడమే మంచిదని జెడిఎస్ అధినేతలు భావిచ్చినట్లు తెలుస్తోంది.