ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక డైలాగుల విషయంలో డిస్టబెన్స్ ఉండదు!

సాధారణంగా మనం సినిమా లేదా ఏదైనా షో చూసేటప్పుడు అందులోని కొన్ని డైలాగులు ఒక్కోసారి అర్థం కావు.మ్యూజిక్ మాత్రమే పెద్దగా వినిపిస్తుంది.

 A New Feature Has Arrived In Prime Video.. No More Distraction In Dialogues Ama-TeluguStop.com

అప్పుడు డైలాగ్స్‌లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది.తత్ఫలితంగా యాక్టర్ ఏం చెప్పాడనేది వినిపించదు.

ఇలాంటి సమస్యలను మనలో అందరం ఎప్పుడో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటాం.అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime video ) ఈ సమస్యను తన యూజర్లు ఫేస్ చేయకూడదని నిర్ణయించింది.

అందుకే తాజాగా “డైలాగ్ బూస్ట్( Dialogue boost )” పేరిట ఓ అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది.

పేరుకు తగినట్లుగానే ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము వింటున్న డైలాగులు వినిపించకపోతే వాటిని బూస్ట్ చేసుకోవచ్చు.అప్పుడు అస్పష్టంగా వినిపించిన డైలాగులు మరింత స్పష్టంగా వినిపిస్తాయి.డైలాగ్ బూస్ట్ ఫీచర్ ఆడియో సెట్టింగ్స్‌లో కొత్తగా యాడ్ అవుతుంది.

అమెజాన్ ఒరిజినల్ వీడియో కంటెంట్ చూసేటప్పుడు ఈ డైలాగ్ బూస్ట్ ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికైతే కొద్ది సెక్షన్ల ఒరిజినల్స్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.కచ్చితంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒరిజినల్స్ లో( English language _ మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది.త్వరలోనే అన్ని ఒరిజినల్ వీడియోలకు ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.

డైలాగ్ బూస్ట్ ఫీచర్ పనితీరు గురించి తెలుసుకుంటే, దీనిని టర్న్ ఆన్ చేసినప్పుడు అది ఒక సినిమా లేదా సిరీస్‌లోని ఒరిజినల్ ఆడియోను చాలా లోతుగా విశ్లేషిస్తుంది.అంతేకాకుండా, అందులో సరిగా వినిపించని డైలాగులను ఫైండ్ అవుట్ చేస్తుంది.అలాగే, ఆ డైలాగ్స్ చూస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్ సౌండ్స్ కాస్త తగ్గించి డైలాగుల వాల్యూమ్‌ మాత్రమే పెంచుతుంది.దీనివల్ల డైలాగ్స్ బాగా వినిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube