ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక డైలాగుల విషయంలో డిస్టబెన్స్ ఉండదు!
TeluguStop.com
సాధారణంగా మనం సినిమా లేదా ఏదైనా షో చూసేటప్పుడు అందులోని కొన్ని డైలాగులు ఒక్కోసారి అర్థం కావు.
మ్యూజిక్ మాత్రమే పెద్దగా వినిపిస్తుంది.అప్పుడు డైలాగ్స్‌లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది.
తత్ఫలితంగా యాక్టర్ ఏం చెప్పాడనేది వినిపించదు.ఇలాంటి సమస్యలను మనలో అందరం ఎప్పుడో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటాం.
అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) ఈ సమస్యను తన యూజర్లు ఫేస్ చేయకూడదని నిర్ణయించింది.
అందుకే తాజాగా "డైలాగ్ బూస్ట్( Dialogue Boost )" పేరిట ఓ అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది.
"""/" /
పేరుకు తగినట్లుగానే ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము వింటున్న డైలాగులు వినిపించకపోతే వాటిని బూస్ట్ చేసుకోవచ్చు.
అప్పుడు అస్పష్టంగా వినిపించిన డైలాగులు మరింత స్పష్టంగా వినిపిస్తాయి.డైలాగ్ బూస్ట్ ఫీచర్ ఆడియో సెట్టింగ్స్‌లో కొత్తగా యాడ్ అవుతుంది.
అమెజాన్ ఒరిజినల్ వీడియో కంటెంట్ చూసేటప్పుడు ఈ డైలాగ్ బూస్ట్ ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
"""/" / ప్రస్తుతానికైతే కొద్ది సెక్షన్ల ఒరిజినల్స్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
కచ్చితంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒరిజినల్స్ లో( English Language _ మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది.
త్వరలోనే అన్ని ఒరిజినల్ వీడియోలకు ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.
"""/" /
ఈ డైలాగ్ బూస్ట్ ఫీచర్ పనితీరు గురించి తెలుసుకుంటే, దీనిని టర్న్ ఆన్ చేసినప్పుడు అది ఒక సినిమా లేదా సిరీస్‌లోని ఒరిజినల్ ఆడియోను చాలా లోతుగా విశ్లేషిస్తుంది.
అంతేకాకుండా, అందులో సరిగా వినిపించని డైలాగులను ఫైండ్ అవుట్ చేస్తుంది.అలాగే, ఆ డైలాగ్స్ చూస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్ సౌండ్స్ కాస్త తగ్గించి డైలాగుల వాల్యూమ్ మాత్రమే పెంచుతుంది.
దీనివల్ల డైలాగ్స్ బాగా వినిపిస్తాయి.
అయ్యబాబోయ్.. వేడి నీటిని ఇంత సులువుగా పొందవచ్చా? (వీడియో)