ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రేమ( Prema ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు చిత్ర పరిశ్రమలోకి ధర్మచక్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె దేవి, ఓంకారం ,మావిడా కలెక్టర్,పోలీస్ పవర్ వంటి సినిమాలలో నటిగా నటించిన మెప్పించారు.
అయితే అతి తక్కువ సమయంలోనే ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో హీరోయిన్ అవకాశాలను కోల్పోయారు.గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ప్రేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరీర్ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు.అయితే ఇండస్ట్రీలో ఈమె అగ్రతారగా కొనసాగుతున్న సమయంలో నటుడు ఉపేంద్ర( Upendra )తో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తల గురించి ప్రేమ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఇలా ఉపేంద్రతో లవ్ రూమర్స్ వచ్చాయి దాని గురించి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించగా ఈమె సమాధానం చెబుతూ ఉపేంద్రతో ప్రేమ గురించి రాసిన వారిని అడగాలి అంటూ సమాధానం చెప్పారు.అది ఒక గాసిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
ఆ సమయంలో నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని అయితే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ సక్సెస్ ( Heroine success ) అయిన తర్వాత తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణమని ప్రేమ తెలిపారు.ఇక ప్రతి ఒక్క విషయంలోనూ కొందరు పాజిటివ్ ధోరణిలో చూడగా మరికొందరు నెగిటివ్గా చూస్తారు.అయితే మన గురించి ఎలాంటి కామెంట్స్ వచ్చిన వాటిని ఎదుర్కోవాలి అంటూ ఈ సందర్భంగా ప్రేమ తెలియజేశారు.
ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా ఆలోచించే దాన్ని కాదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.