పురుషులకంటే ఆడవారి మెదడు చిన్నదా? పెద్దదా? అసలు నిజం బయటబెట్టిన అధ్యయనాలు..

మనిషికి మెదడు( brain ) ఎంతో అవసరం.మెదడు లేకపోతే మనిషి జంతువు లాంటివాడు.

 Are Women Brains Smaller Than Mens? Is It Big Studies That Revealed The Real Tr-TeluguStop.com

అందుకే మెదడును ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవాలి.అయితే చాలామందికి పురుషులు, స్త్రీలలో( men and women ) ఎవరి మెదడు పెద్దది అన్న విషయం తెలిసి ఉండదు.

అయితే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు( Cambridge, University of Oxford ) దీనికి సమాధానం ఇచ్చారు.వారి పరిశోధనలు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ విశ్విద్యాలయాల పరిశోధకులు MRI లాంటి పరీక్షలను ఉపయోగించి, స్త్రీలు, పురుషుల మెదడుల పరిమాణాన్ని పోల్చారు.

దీంతో పురుషుల మెదడు పరిమాణం మహిళల కంటే 8 నుంచి 13 శాతం ఎక్కువగా ఉన్నట్లు వాళ్లు గుర్తించారు.

అంతేకాకుండా స్త్రీ, పురుషుల మెదడు పరిమాణం లో వ్యత్యాసానికి శారీరక నిర్మాణమే కారణం అని వారు అధ్యాయనం లో గమనించారు.

అయితే పురుషుల ఎత్తు మహిళల కంటే సాధారణంగా ఎక్కువగా ఉంటుంది.అలాగే వారి మెదడు పరిమాణం కూడా అలాగే అవుతుంది.ఈ వ్యత్యాసం తెలివితేటలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించినట్లు గమనించబడలేదు.అయితే అధ్యయనంలో మహిళల ఇన్సులర్ కార్టెక్స్ పురుషుల కంటే చాలా పెద్దదిగా ఉన్నట్లు గుర్తించబడింది.

Telugu Cambridge, Tips, Brain, Oxd-Telugu Health

అయితే ఈ భాగం మెదడులో భావోద్వేగాలు, వైఖరులు, తాకికం స్వీయ అవగాహనతో ముడిపడి ఉంటాయి.స్త్రీలు మరింత భాగోద్వేగానికి లోనవ్వడానికి ఇదో కారణమని చెప్పవచ్చు.అయితే పురుషుల అమిగ్డాలే పెద్దవిగా ఉంటాయి.మెదడులో ఈ భాగం మోటారు నైపుణ్యాలు, మనుగడ, ఆధారిత భావోద్వేగాలు, బాధ్యత వహిస్తాయి.అందుకే పురుషులలో ఆనందించే, సామర్థ్యం, శారీరక శ్రమ, నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం లాంటివి మెరుగ్గా కనిపిస్తాయి.

Telugu Cambridge, Tips, Brain, Oxd-Telugu Health

ఇక నాన్ వెస్ట్రన్ మెడిసిన్ ప్రకారం మహిళలకు డిప్రెషన్, ఆల్జీమర్స్, మల్టిపుల్స్ స్క్లేరోసిస్,స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.అందుకే ఈ వ్యాధుల మీద మరింత అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.ఇక పురుషులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కూడా వీటికి భిన్నంగానే ఉంటాయి.

అందుకే వారు ఆల్కహాల్ అడిక్షన్, ఆంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్, ఆటిజం, పార్కిన్సన్ లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube