పదవ తరగతి హిందీ పేపర్ ప్రశ్నాపత్రం లీక్( SSC Paper Leak Case ) కేసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసుల అరెస్టు చేయడం తెలిసిందే.అయితే ఈ కేసులో బండి సంజయ్( Bandi Sanjay ) ను పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరు పరచగా.
కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధించారు.దీంతో బండి సంజయ్ ను జైలుకు తరలించే ఏర్పాట్లు అధికారులు చేశారు.
న్యాయస్థానంలో హాజరు పరిచిన సమయంలో పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని.బండి సంజయ్ తన శరీరంపై గాయాలను జడ్జికి చూపించడం జరిగింది.
అయితే కాపీయింగ్ ప్లాన్( Copy Plan )తో … ప్రభుత్వంపై కుట్రకు తెర లేపారని పోలీసుల వాదనతో జడ్జి ఏకీభవించి రిమాండ్ విధించడం జరిగింది.మరోపక్క బండి సంజయ్ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్( Bail Petition ) దాఖలు చేశారు.తెలంగాణ 10వ తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో ఏ1గా బండి సంజయ్, ఏ 2 గా బూర ప్రశాంత్, ఏ 3 గా మహేష్, ఏ 4 గా బాలుడు, ఏ 5 గా మోతం శివ గణ్ష్, ఏ 6 గా పోగు సుభాష్, ఏ 7 గా పోగు శశాంక్, ఏ 8 గా దూలం శ్రీకాంత్, ఏ 9 గా పెరుమాండ్ల శార్మిక్, ఏ 10 గా పోతబోయిన వసంత్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.