రెచ్చిపోతున్న ఖలిస్తానీ మద్ధతుదారులు.. కెనడాలో గాంధీ విగ్రహం ధ్వంసం, మోడీపై పిచ్చిరాతలు

ఖలిస్తాన్( khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాత్ సింగ్( Amritpal Singh ) వ్యవహారంతో పంజాబ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.గడిచిన వారం రోజులుగా ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.

 Mahatma Gandhi Statue Defaced With Pro-khalistan Graffiti In Canada Ontario Deta-TeluguStop.com

కానీ నేటి వరకు అమృత్‌పాల్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఉత్తరాఖండ్‌లో వున్నాడని, టోల్‌గేట్ మీదుగా ఆయన కారు వెళ్లిందని ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కానీ అమృత్‌పాల్ మాత్రం చిక్కడం లేదు.భారత్‌ను వీడి నేపాల్ మీదుగా కెనడా ( Canada ) పారిపోవాలన్నది ఆయన వ్యూహాంగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే దేశ సరిహద్దుల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది.బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, భారత సైన్యం ఎక్కడికక్కడ దిగ్భంధించేశాయి.

Telugu Amritpal Singh, Canada, Gandhistatue, Mahatmagandhi, Ontario, Ontariogand

ఇదిలావుండగా.అమృత్‌పాల్‌కు మద్ధతుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో వున్న ఖలిస్తాన్ అనుకూలవాదులు రంగంలోకి దిగారు.భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వీరు నిరసనలకు దిగుతున్నారు.ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలలో ఖలిస్తాన్ మద్ధతుదారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

భారత్ హెచ్చరికలతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.భారత దౌత్య కార్యాలయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశాయి.

Telugu Amritpal Singh, Canada, Gandhistatue, Mahatmagandhi, Ontario, Ontariogand

తాజాగా కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని( Mahatma Gandhi statue ) ఖలిస్తాన్ వాదులు ధ్వంసం చేశారు.హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్‌లో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.గాంధీ విగ్రహం 2012 నుంచి ఈ ప్రాంతంలోనే వుంది.ఆరు అడుగుల ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో ప్రధాని నరేంద్ర మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.అనంతరం విగ్రహం పక్కనే ఖలిస్తానీ జెండాను ఎగురవేశారు దుండగులు.

అయితే విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు విగ్రహం వద్ద పిచ్చిరాతలు చెరిపివేసి, శుభ్రం చేశారు.కాగా.

గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube