అషు రెడ్డి(Ashu Reddy) పరిచయం అవసరం లేని పేరు సమంత పోలికలతో ఉండడంతో ఈమెను జూనియర్ సమంత(Junior Samantha) అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమెని అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డి ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుని కూడా బిజీగా ఉన్నారు.
ఇలా ఒకవైపు వెండితెర పైన మరోవైపు సోషల్ మీడియాలో ఈమె పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉన్నారు.

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అషు రెడ్డి రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ వచ్చారు.రామ్ గోపాల్ వర్మను(Ram Gopal Varma) ఇంటర్వ్యూ చేస్తూ చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.
ఇలా తరచూ గ్లామర్ షో(Glamor show) చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న అషు రెడ్డి తాజాగా ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె స్నేహితులు తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.నడవలేని స్థితిలో ఆసుపత్రి బెడ్ పై అషు రెడ్డి చేతికి సెలైన్ పెట్టి ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు ఉన్నఫలంగా ఇలా ఆస్పత్రి పాలవ్వడానికి గల కారణం ఏంటి? అసలు అషు రెడ్డికి ఏమైంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఈమె ఆసుపత్రి పాలైందని తెలియడంతో ఎంతో మంది అభిమానులు త్వరగా కోలుకొని తిరిగి రావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.