ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగారు.మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ కవిత నిరసన కార్యక్రమం చేపట్టారు.
కాగా కవిత దీక్షకు 18 పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతున్నారు.
సాయంత్రం 4 గంటల వరకు సాగనున్న ఈ దీక్షకు వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాలు నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు.