సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అయితే ఫోటోలలో కానీ డైరెక్ట్ గా కానీ మహేష్ బాబును చూసిన వాళ్లు మాత్రం ఆయన వయస్సు 47 అంటే అస్సలు నమ్మలేరు.
సినిమా సినిమాకు మహేష్ బాబుకు వయస్సు తగ్గుతోందని నెటిజన్లు సైతం చెబుతున్నారు.మహేష్ లేటెస్ట్ ఫోటోలు చూసి షాకవ్వడం ఇండస్ట్రీ వర్గాల వంతవుతోంది.
ప్రతిరోజూ వర్కౌట్స్ చూస్తున్న మహేష్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటూ సరికొత్త లుక్ తో మహేష్ బాబు నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుండగా మహేష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.మహేష్ తర్వాత మూవీ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ సినిమా మరో బాహుబలి అవుతుందని రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.
మహేష్ లుక్ ను చూసి అన్నం తింటున్నావా అందం తింటున్నావా అంటూ వినిపిస్తున్న కామెంట్లు అభిమానులను సైతం సంతోషపెడుతున్నాయి.మహేష్ కు పెళ్లై చాలా సంవత్సరాలు అయినా అమ్మాయిల హృదయాలను మాత్రం మహేష్ బాబు ఇప్పటికీ గెలుచుకుంటున్నారు.మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడని కొంతమంది చెబుతున్నారు.
మహేష్ బాబు సినిమాలు విడుదలైతే రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ త్రివిక్రమ్ సినిమాలో కూడా సరికొత్త లుక్ లో కనిపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ తన గ్లామరస్ లుక్ తో ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.సినిమా సినిమాకు మహేష్ బాబు రేంజ్ ఊహించని విధంగా పెరుగుతోంది.