హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.హిమాయత్ సాగర్ లో నిషేధిక మాదక ద్రవ్యాలను ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారని తెలుస్తోంది.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ అలీగా గుర్తించారు.కాగా ఆడీ కారులో వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.