పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ”హరిహర వీరమల్లు’ ఒకటి.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
హరిహర వీరమల్లు షూట్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతున్న కనీసం చివరి దశకు కూడా చేరుకోలేక పోయింది.
ఇక ఈ సినిమా షూట్ ఇప్పటికి 60 శాతానికి పైగానే పూర్తి అయ్యింది అని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొనడం లేదు.ఈయన మిగిలిన సినిమాలతో బిజీగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాకు కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది అని గత కొద్దీ రోజుల క్రితం ఒక వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.
మరి దీనిపై లేటెస్ట్ గా ఒక క్లారిటీ అయితే తెలుస్తుంది.సినిమాకు పార్ట్ 2 కి అయితే పోజిబిలిటీ ఉంది కానీ మేకర్స్ కు అయితే పార్ట్ 2 ను ఇప్పట్లో తెరకెక్కించే ఉద్దేశం లేదని.ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓకే అంటేనే నెక్స్ట్ పార్ట్ స్టార్ అవుతుంది అని తెలుస్తుంది.
దీంతో ఇప్పట్లో అయితే ఈ సినిమా ఒక్క పార్ట్ మాత్రమే రానుంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
ఇక పవన్ కళ్యాణ్ వీరమల్లు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా, వినోదయం సీతం రీమేక్ కూడా చేస్తున్నాడు.