తాను ఒక మ్యాజిక్ అంటున్న మెహరీన్ ఫిర్జాదా.. ఆ మాటతో షాకిచ్చిన నెటిజన్?

మామూలుగా ఎవరికైనా తమని తాము పొగుడుకోవడం అసలు ఇష్టం ఉండదు.కానీ కొందరు మాత్రం తమని తాము పొగుడుకుంటారు.

 Mehreen Firzada Says She Is A Magic Is The Netizen Shocked By That Statement, Me-TeluguStop.com

అలా పొగుడుకున్న వాళ్ళని చూసి చాలామంది కౌంటర్స్ వేస్తూ ఉంటారు.అలా సామాన్యులనే కాదు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా తమ డప్పు తాము మోగిచ్చుకుంటే మాత్రం వారికి విమర్శలు తప్పవు.

తాజాగా మెహరీన్ ఫిర్జాదా కూడా తనని తాను పొగుడుకోవడంతో వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మెహరీన్.పంజాబీ కి చెందిన ఈ బ్యూటీ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.

మెహరీన్ తొలిసారిగా నాచురల్ స్టార్ హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో  ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు నటన పరంగా కూడా తొలిచూపులతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత మరిన్ని  సినిమాలలో అవకాశాలు అందుకుంది.స్టార్ హీరోలలో సినిమాలలో అవకాశాలు అందుకొని ఏకంగా స్టార్ పోజిషన్ సొంతం చేసుకుంది.ఇక కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా.అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి.

అలా అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.  తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది మెహరీన్.

ఇక ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా ఎనర్జీగా కనిపించడంతో.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

తన సినిమాల అప్డేట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి బాగా షేర్ చేస్తూ ఉంటుంది.బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేస్తుంది.

అప్పుడప్పుడు తను చేసే విన్యాసాల వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి అభిమానం ఉంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకుంది.

అందులో తను కారుపై కూర్చొని క్యూట్ గా కనిపించింది.ఇక ఆ ఫోటోకు ఆమె ఒక మ్యాజిక్ అంటూ ఒక క్యాప్షన్ షేర్ చేసుకోగా వెంటనే ఓ నెటిజన్ ఆమె ఒక మ్యాజిక్ కానీ నువ్వు మాత్రం కాదు అంటూ తిరిగి షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం ఆ ఫోటో తో పాటు ఆ కామెంట్ కూడా బాగా వైరల్ అవుతుంది.ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube