ఏప్రిల్ 20న హైబ్రిడ్ సూర్యగ్రహణం.. పదేళ్లకోసారి కనిపిస్తుంది..

సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటుంటారు.గ్రహణాల సమయంలో చాలా నియమాలు పాటిస్తుంటారు.

గ్రహణం పూర్తయ్యే వరకు ఆహారం కూడా ముట్టుకోరు.జ్యోతిషశాస్త్ర అంచనా ప్రకారం, 2023 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు జరగనున్నాయి.2023 సంవత్సరంలో మొట్టమొదటి సౌర గ్రహణం గురువారం 2023 ఏప్రిల్ 20 న జరుగుతుంది.ఈ గ్రహణం ఉదయం 7.10 నుండి ప్రారంభమవుతుంది.మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది.కానీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించే అవకాశాలు లేవు.

అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.భారతదేశం కాకుండా, ఈ గ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా మరియు అంటార్కిటికాలో కనిపిస్తుంది.

దీనిని హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పిలుస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలున్నాయి.

Telugu Antarctica, Australia, Hybridsolar, Zealand, Solar Eclipse-Latest News -

గ్రహణాలు ఏర్పడినప్పుడు కొన్ని ఏళ్లకు ఒకసారి ప్రత్యేకంగా కనిపించేవి ఉంటాయి.ఏప్రిల్ 20న జరిగే హైబ్రిడ్ సూర్య గ్రహణానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.ఇది పది సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది.ఏప్రిల్ 20 తర్వాత మరలా 2031 నవంబర్ 14న మాత్రమే ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం వస్తుంది.ఈ సూర్య గ్రహణం కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా ఏర్పడుతుంది.

Telugu Antarctica, Australia, Hybridsolar, Zealand, Solar Eclipse-Latest News -

అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా మాత్రమే ఈ సూర్య గ్రహణం కనిపిస్తుంది.ఇలా రెండు రకాలుగా ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం కనిపిస్తుంది.అందుకే దీనిని హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పిలుస్తుంటారు.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలతో పాటు ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం కనిపించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube