బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో దూకుడు పెంచారు.బి ఆర్ ఎస్ ను జాతీయ స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో భారీగా నిర్వహించారు.ఇక ఆ తరువాత విశాఖలో రెండో సభను నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా మహారాష్ట్రలోని నాందేడ్ లో రెండో సభను నిర్వహించారు.
ఈ సభ కూడా సక్సెస్ కావడంతో, కెసిఆర్ మంచి ఉత్సాహంగా ఉన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ లోకి చేరికలు మొదలయ్యాయి.
ఏపీ నుంచి తోట చంద్రశేఖర్ , రావెల కిషోర్ బాబు వంటి వారు చేరగా, తోట చంద్రశేఖర్ ను ఏపీ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడిగా నియమించారు.అలాగే ఒడిశా నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమంగో చేరారు.
వెంటనే ఆయనను బీఆర్ఎస్ ఒడిశా అధ్యక్షుడిగా నియమించారు.ఇక ఇదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చేరికలను ప్రోత్సహించి బలమైన పార్టీగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ని ఢీ కొట్టాలనే లక్ష్యం తో కేసీఆర్ ఉన్నారు.
ఇక బీఆర్ఎస్ మూడో సభను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది.కేసీఆర్ మాత్రం మూడో సభను విశాఖలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట .ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఈ సభకు జన సమీకరణ చేపట్టాలంటూ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఆదేశాలు అందడం తో ఆయన జన సమీకరణ పై దృష్టి సారించారట.
ఈనెల ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో బీఆర్ఎస్ సభను విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారట.ఇక విశాఖపట్నం సభ ముగిసిన తర్వాత కర్ణాటకలోని రాయచూరులో గాని లేదా కలబురిగి లో కానీ ఈ సభను నిర్వహించాలనే ప్లాన్ తో ఉన్నారట. ఏపీ, కర్ణాటకలో సభ ముగిసిన తరువాత ఢిల్లీ కేంద్రంగా మరో సభను నిర్వహించి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.