దొడ్డిదారిన అమెరికాలోకి.. మానవ అక్రమ రవాణా ముఠాలకు భారతీయులు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా..?

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

 Indian Nationals Pay Us 21000 Dollars To Cartels For Help Illegally Crossing Ame-TeluguStop.com

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

కాగా.అక్రమంగా అమెరికా సరిహద్దులను దాటేందుకు గాను భారతీయులు భారీగా ముట్టజెబుతున్నారట.ఈ విషయాన్ని అగ్రరాజ్యానికి చెందిన చట్టసభ సభ్యులు చెబుతున్నారు.కార్టెల్‌గా పిలిచే మానవ అక్రమ రవాణా ముఠాలు, క్రిమినల్ గ్యాంగ్‌లకు ఒక్కొక్క భారతీయుడు సరాసరిగా 21,000 అమెరికన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు అరిజోనా షెరీఫ్ చట్టసభ సభ్యులతో చెప్పారు.

చట్టవిరుద్ధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి ఒక విదేశీ పౌరుడి నుంచి కార్టెల్ వసూలు చేసే మొత్తం 7000 అమెరికా డాలర్లని అరిజోనాలోని కోచీస్ కౌంటీకి చెందిన షెరీఫ్ మార్క్ డానెల్స్ ఈ వారం హౌస్ జ్యుడిషియరీ కమిటీ సభ్యులతో అన్నారు.

Telugu Cartels, American, Mexico, Sheriffmark, Dollars, Customa, Usa-Telugu NRI

మెక్సికో వెంబడి వున్న సరిహద్దు సురక్షితంగా లేదని చట్టసభ సభ్యులకు తెలియజేసిన ఆయన.కార్టెల్స్ అని పిలిచే క్రిమినల్ ట్రాన్స్‌నేషనల్ సంస్థలు అమెరికా దక్షిణ సరిహద్దును నియంత్రిస్తున్నాయని చెప్పారు.జాతీయత ఆధారంగానూ ముఠాలు ధరలు నిర్ణయిస్తున్నాయని షరీఫ్ తెలిపారు.

ఉదాహరణకు భారతీయులు గరిష్టంగా 21,000 అమెరికా డాలర్లు, కనిష్టంగా 7000 డాలర్లను ఈ ముఠాలకు చెల్లిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Telugu Cartels, American, Mexico, Sheriffmark, Dollars, Customa, Usa-Telugu NRI

ఇదిలావుండగా గతేడాది అక్రమ మార్గాల్లో పట్టుబడిన వారి వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గత నెలలో విడుదల చేసింది.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్య 2022లో రెండింతలు పెరిగినట్లు తెలిపింది.గతేడాది అక్టోబర్ , నవంబర్ నెలల్లో మెక్సికో సరిహద్దు వద్ద 4,297 మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకోగా… 2021లో ఇదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డ వారి సంఖ్య 1,426.మొత్తంగా 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పలు దేశాలకు చెందిన 2.77 మిలియన్ల మంది అగ్రరాజ్యంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube