వికలాంగుల ఉద్ధరణే ధ్యేయంగా వారికి శిక్షణ ఇస్తూ, ఉపాధి కల్పించే ఒక మహత్తర కార్యక్రమాన్ని ‘జియో తెలంగాణ‘ తాజాగా చేపట్టి తన ఉదారతను చాటుకుంది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత వాసులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
‘జియో అసోసియేట్’ ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీతో కలిసి సొంతంగా ఆర్జించేందుకు జియో అవకాశాన్ని కల్పిస్తుండడం విశేషం.దీని ద్వారా ప్రతి నెలా సుమారు రూ.16,000 వరకు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రత్యేక నైపుణ్యం కలిగిన వికలాంగ యువ పురుషులు, మహిళలా అభ్యర్థులకు హైదరాబాద్ వ్యాప్తంగా జియోలో ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు.
దీనికోసం వారు చేయాల్సిందల్లా ఒక్కటే.స్మార్ట్ ఫోన్‌ని ఆపరేట్ చేయగలగడం.
అవును, రిలయన్స్ స్టోర్‌ల వద్ద తక్కువలో తక్కువ 8 గంటలు గడిపితే చాలు.ఒక 4G స్మార్ట్ ఫోన్ మరియు రూ.1000 కనీస పెట్టుబడితో వినియోగదారులకు జియో సేవలను అందించడం ద్వారా స్యయంగా వ్యాపారం నిర్వహించుకుందుకు ఇక్కడ వీలుంటుంది.

ఈ ప్రోగ్రాం ద్వారా వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా ఆసరాగా మారవచ్చు.జీవితంలో ఏదన్నా చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.సామర్థ్యం, అంకితభావంతో ఇక్కడ పని చేసుకుంటే కస్టమర్ల మనసులను దోచుకోవచ్చు.
మరింతగా సంపాదించుకొనే అవకాశం కలదు.ఈ కింది చిరునామాలో జియో మేనేజర్‌ని సంప్రదించవచ్చు.
